Clean and Green

“పరిశుభ్రత మరియు పచ్చదనము” (Clean and Green)అనే అంశము మీద  అవగాహన ర్యాలీ

జగన్నాధరాజు నగర్ కోలని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఒక చిన్న కోలని. ఈ కొలనిలో యూనివర్సిటీ ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, ఉద్యోగస్తులు,వ్యాపారస్తులు, ఇంకా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం ఈ కోలని యెప్పుడు నీటిలో ములిగి లోతట్టు ప్రదేశంలా ఉండేది. 1993 లోకోలని జె.ఆర్.నగర్ అసోసియేషన్ యేర్పడింది. అప్పటినుంచి యెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.కోలని అసోసియేషన్ ప్రతీనెల ఒక న్యూస్బుల్లెటిన్ కూడా ప్రచురిస్తోంది. డిసెంబర్, 2003 లో ఈ అసోసియేషన్ తన మొదటి దశాబ్దపు వేడుకల సందర్భముగా  మోడల్ కోలని మీద ఒక సెమినార్నిర్వహించింది. కొలనీలు పరిశుభ్రత పాటించి  పర్యావరణాన్ని యెలా కాపాడుకోవాలో ఈ సెమినార్లో చర్చించి, దానికి సంబంధించి ఒక సావనీర్ ముద్రించడం కూడాజరిగింది. మున్సిపల్ కార్పొరేషన్, తదితర సంస్థలు ఈ కార్యక్రమాన్ని యెంతో ప్రశంచించాయి.

వచ్చేసంవత్సరములో ఈ కోలని 2 దశాబ్దాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భముగా అసోసియేషన్ యెన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా, 18,నవంబర్, 2012, ఆదివారం ఉదయం  0830 గం.కు “పరిశుభ్రత మరియు పచ్చదనము”  అనే ఆంశం మీద ఒక  అవగాహన ర్యాలీ నిర్వహించడానికి నిర్ణయించడంజరిగింది. కొలనిలో వారికి పర్యావరణం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచేయడం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం.

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, జోనల్ ఆఫీసు,విశాఖపట్నం, జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఎంజినియర్, శ్రీ కె. వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికిముఖ్య అతిధిగా, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీ ఒఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి.యెస్.యెన్.రాజుగారు మరియు గీతం యూనివర్సిటీ,CPC,ఇంచార్జ్ డైరెక్టర్,ప్రొఫెసర్ యెస్. రామకృష్ణ రావు గారు గౌరవ అతిధులుగా వ్యవహరించారు. కొలనిలోని  పౌరులు, సీనియర్ సిటిజన్లు,విధ్యార్ధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రారంభఉపన్యాసములో అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.కె.యెస్.ఆర్.మూర్తి గారు కోలని గత 20 సం.లు గా సాధించిన అభివృద్ధి గురించి వివరించారు.ముఖ్యముగా ప్రోఫ్.బి ఆర్కె రాజు గారి ఆధ్వర్యములో జరిగిన ప్రగతిని గురించి తెలిపారు. కొలనిలో వారంతా పర్యావరణాన్ని కాపాడటానికి కృషి చేయాలని తెలిపారు. కొలనిలోని ప్రముఖులకువారు చేసిన సహాయాలకు కృతజ్నతలు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ కె ఆర్ యెమ్ పట్నైక్ గారు కోలని కార్యక్రమాల గురించి, సాధించిన ప్రగతిని వివరంగా  చెప్పారు.గౌరవ అతిధులు ఆంధ్ర యునివర్సిటి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రోఫ్. జి యెస్ యెన్ రాజు గారు,గీతం యునివర్సిటి ప్రోఫ్.యెస్. రామకృష్ణ రావు గారు, ముఖ్య అతిధి కె వేంకటేశ్వర రావు గారు  పర్యావరణ కాలుష్యాన్ని గురించి సోదాహరణంగా వివరించారు.

Details of thie Event in JR Nagar News, December, 2012